![]() |
![]() |

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈరోజు ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఆలియా, రణ్‌బీర్ ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లిపీటలు ఎక్కారు. పెళ్ళైన మూడు నెలలకే ఆలియా గర్భవతి అయినట్టు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఇటీవల ఆమె సీమంతం కూడా జరిగింది. ఇక తాజాగా ఆలియా ఆస్పత్రిలో చేరిందని, డెలివరీ డేట్ రావడంతోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు న్యూస్ వినిపించింది. ఊహించినట్టుగానే ఈరోజు మధ్యాహ్నం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నిఆలియా-రణ్‌బీర్ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
![]() |
![]() |